1, మార్చి 2011, మంగళవారం

గిరిజనుల ఐకమత్యానికి చిచ్చు
-ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్

లంబాడీలను ఎస్‌టి (షెడ్యూల్డ్ ట్రైబ్) జాబితా నుంచి తొలగించాలా? ఎందుకు? లంబాడీలకు ఎస్‌టి హోదాను వ్యతిరేకిస్తున్నవారు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాక ఇటీవలి కాలంలోనే వారు భారతదేశానికి వలస వచ్చారని ఆరోపిస్తున్నారు. చరిత్ర చెబుతున్నదేమిటో చూద్దాం.

గిరిజన తెగలలో ఒక ఉపకులమైన లంబాడీలు అనబడే గోర్ బంజారాలు క్రీ.శ. ఒకటవ శతాబ్దం కంటే ముందే భారతదేశంలో స్థిరపడ్డారు. ఇందుకు అనేక ఆధారాలున్నాయి. బంజా ర అనే పదం ఒక సంస్కృత పదం నుంచి ఉత్పన్నమయింది. దీనర్థం వనచరులు (ఫారెస్ట్ వాండర్స్). పశుపోషణ వారి జీవనాధారం. కొండలు, అడవులు, పచ్చిక మైదానాలు వారి ఆవాస స్థానాలు. పశువులపైన గోనె సంచులలో ఉప్పు నింపుకొని వస్తు మార్పిడి ద్వారా జొన్నలు, ఇతర తృణ ధాన్యాలను సేకరించుకుంటూ శతాబ్దాలుగా సంచార జీవనాన్ని కొనసాగిస్తున్న ప్రశాంత ప్రజలు లంబాడీలు లేదా బంజారాలు.

ఆంగ్లేయులు బంజారాలనుLONG BODIES అని పిలిచేవారు. ఆ ఆంగ్ల పదం నుంచి లంబాడి అనే పేరు వచ్చి ఉంటుందనేది ఒక నానుడి. ఇప్పుడు అతి దయనీయమైన బతుకులు వెళ్ళదీస్తున్న లంబాడీలు మధ్యయుగాలలోను, ఆధునిక యుగంలోను దేశచరిత్రలో అవిస్మరణీయమైన పాత్ర నిర్వహించారు. చారిత్రక వాస్తవాలను పట్టించుకోకుండా కొందరు రాజకీయ స్వలాభాపేక్షతో గిరిజనులలో వైషమ్యాలు సృష్టించడం సమంజసమేనా?

శ్రీవెంకటేశ్వరస్వామి మహాభక్తుడు, ఏడుకొండలపై ఒక మఠాన్ని స్థాపించిన బాబా హాతీరామ్‌జీ మహరాజ్ పుట్టుకతోనే భారతీయ గిరిజనుడు. ఏడకొండలస్వామి ఆయన మఠానికి వచ్చి పాచికలు ఆడేవారని ప్రతీతి. ఒక రోజు స్వామివారు తన హారాన్ని మఠంలోనే వదిలి వెళ్ళారు. ఆ హారాన్ని గమనించిన హాతీరామ్‌జీ దాన్ని అధికారులకు చూపించాడు. బాబా మాటలను నమ్మని అధికారులు ఆయన్ని ఒక గదిలో నిర్బంధించారు. 'నీవు నిజాయితీపరుడవయితే 10 కిలోల అన్నం, పది కిలోల చెరకు గడలు ఒక్క రోజులోనే తినాలని' ఆజ్ఞాపించారు. హాతీరామ్ జీ ఐదునిమిషాలలోనే ఆ ఆహార మంతటినీ భుజించారట! ఆయన జీవ సమాధి ఇప్పటికీ తిరుమల తిరుపతిలోని హాతీరామ్ మఠ్‌లో ఉంది.

అనంతపురం జిల్లా గుత్తిలోని గొల్లల దొడ్డి ప్రాంతంలో లంబాడీల కుల దైవమైన సేవాలాల్ మహరాజ్ గఢ్ కలదు. సేవాలాల్ 1739 ఫిబ్రవరి 15న జన్మించాడు. శివ పూజాపరు డు. ఆయన తండ్రి,తాతలు తెగ పెద్దలు. గుత్తి మండలంలోని గొల్లల గుడి ప్రాంతంలో అఖిల భారత బంజారా సేవాసంఘ్ అధ్యక్షుడు రంజిత్ నాయక్, కిషన్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో ఇటీవల ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించి, అందులో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఏటా ఫిబ్రవరి 15న దేశం నలుమూలల నుంచీ లంబాడి గిరిజనులు పెద్ద సంఖ్యలో గొల్లల గుడికి చేరుకుని పూజలు జరుపుతారు.

ఈ చరిత్రను అలా ఉంచితే ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 70 దేశాలలో గిరిజనులు విస్తరించిఉన్నారు. వీరిలో 70 శాతం మంది ఆసియా దేశాలలోనే ఉన్నారు. ప్రత్యేక వేష భాషలు, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అరుదైన జీవన విధానం ఉండడం వల్ల ఎల్లెడలా వారు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు. అn్టౌn్ఛజూజ్చూ ఇౌటఛీౌn్ఛ, ఐఊఅఈట కో-ఆర్డినేటర్ ప్రకారంగా 'Antonella Cordone, IFADs Mø&BÇz¯óþrÆŠÿ {ç³M>Ææÿ…V> "Indigenous Peoples are the Custo dians And Managers of our Natural resources" గిరిజనులను అని అభివర్ణించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అలవర్చుకునే శక్తి గిరిజనులకు మాత్రమే ఉందనేది Antonella Cordoneసునిశ్చిత విశ్వాసం. 1991 జనాభా గణన ప్రకారం దేశ జనాభాలో ఎనిమిది శాతం గిరిజనులు. వీరు దేశవ్యాప్తంగా విస్తరించి 645 జిల్లాల్లో షెడ్యూల్డు తెగలు గా ప్రభుత్వంచే గుర్తింపు పొందివున్నారు.

బంజారాలు రాజపుత్రుల లాంటివారని చరిత్రకారుడు కల్నల్ టాడ్ పేర్కొన్నారు. 'పృధ్వీరాజ్ రాసో' కావ్యకర్త చాంద్ బర్దాయి కూడా వారిని రాజపుత్రులని అభివర్ణించారు. లంబాడీలు/ బంజారులు/ సుగాలీలు/ గ్వార్ భాయ్ అని పిలవబడుతున్న ఈ గిరిజనులు ప్రపంచ వ్యాప్తంగా గోర్ బంజారాలు గా వాసికెక్కారు. సూర్య భగవానునిని ఆరాధించే సంప్రదా యం వీరికి ఉంది. మహమ్మద్ ఘోరీకి వ్యతిరేకంగా పృధ్వీరాజ్ చౌహాన్ పక్షాన పోరాడిన వీరోచిత చరిత్ర ఈ బంజారాలకు ఉంది.

దక్కన్ పీఠభూమిలో లంబాడీలు కాకతీయుల కంటే ముందే ఉన్నారని చరిత్ర చెబుతుంది. సంచార జాతివారైన లంబాడీలు రజాకార్లతో కూడా పోరాడారు. పలువురు నవాబులు వారి ధైర్యసాహసాలను మెచ్చి గ్రామాల భూములను ఇనాములుగా ఇవ్వడం జరిగింది. పోలీసు పటేల్, మాలీ పటేల్ మొదలైన ప్రభుత్వోద్యోగాలలో కూడా నియమితులైన లంబాడీలు చాలా మంది ఉన్నారు.

బంగి-జంగి అనే ఇద్దరు బంజారా సోదరులు మొగల్ సైన్యాలకు ఆహారపదార్థాలు, ఆయుధాలను రవాణా చేస్తూ హైదరాబాద్‌కి చేరుకున్నారు. వారికి 2.30 లక్షల పశువులు ఉండేవి. వాటికి అవసరమైన గ్రాసం కొరకు ప్రస్తుత బంజారాహిల్స్ ప్రాంతాన్ని ఉపయోగించుకోవల్సిందిగా మొదటి అసఫ్‌జాహినవాబు వారికి వ్రాసి ఇచ్చారు. కనుకనే ఆ ప్రాంతం బంజారా హిల్స్‌గా పేరు గాంచింది. బంజారాల సహకారానికి మొదటి నిజాం నవాబు తన రాజముద్రతో స్వయంగా వ్రాసి ఇచ్చిన ఒక ఫర్మానా ఇలా తెలుపుతుంది: 'ఎక్కడ నీరు ఉన్నా, రంజన్లలో ఉన్నా ఉపయోగించుకోవచ్చు; పశువులకు కావలసిన గడ్డి మోపుకోవచ్చు; ర

ోజుకు ముగ్గురిని చంపిన మాఫి; అసబ్ వంశం గుర్రాలు ఎక్కడ ఉంటే దాని ప్రక్కనే జంగి-బంగికి చెందిన పశువులు ఉండవచ్చు'. నల్లగొండ జిల్లాలోని ప్రస్తుత చిట్యాల మండలంలో గల అందుకు తండా ప్రాంతంలో సోమ్లా లే అనే లంబాడా ఉండే వాడు. పేదలను ఆదుకునేందుకు దారి దోపిడీలకు పాల్పడేవా డు. అతన్ని పట్టుకోవడం నిజాం నవాబులకు ఒక సవాలుగా మారింది. అదే ప్రాంతానికి చెందిన మరో లంబాడా అజ్మీరా భీమానాయక్ సహాయంతో సోమ్లాను బంధించి ఉరి తీయించారు. భీమా నాయక్‌కు 32 గ్రామాలను ఇచ్చారు. ఆ గ్రామా ల పాలన బాధ్యతలను అతనికే అప్పగించారు. ప్రస్తుత చల్లగరి గే, గోపాలపురం, సుబ్బక్క పల్లె మొదలైనవి.

వరంగల్ జిల్లాలోని ప్రస్తుత వెంకటాపురం మండలంలోని గుర్రంపేట్ ప్రాంతంలో బండ్ల పహాడ్ అరణ్యాన్ని స్థావరంగా చేసుకొని మూడ్ భార్త్యా, భోప్త్యా అనే లంబాడా సోదరులు నిజాం నవాబుకు ఎదురు తిరిగారు. ఖజానాకు జమ చేసే శిస్తు రూపేణా ఇచ్చే నాణాలను దొంగిలించారు. ఈ సోదరులను ఎవరూ పట్టుకోలేకపోయారు. ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ ఆ సోదరుల కులానికే సంబంధించిన పోరిక వంశస్తులను పిలిపించి భార్త్య, భోప్త్యాలను మీరే పట్టించాలని వారి పై ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షలను తట్టుకోలేక ఆ సోదరులను పట్టుకోవడానికే వారు నిర్ణయం తీసుకున్నారు.

గుర్రంపేటకు సమీపాన గల ఎంగ్లాస్‌పురం అనే తాటివనానికి వారిని పిలిపిం చి, తాగించి, బంధించి నవాబుకు అప్పగించారు. మహబూబ్ అలీ వారి ప్రభు భక్తికి మెచ్చుకున్నారు. పోరిక వంశస్తులకు 23 ఎకరాల భూమిని, రెండు బ్రాందీ సీసాలను ఇనాముగా ఇచ్చారు.

ఈ బంజారాలు ఎవరికి హాని తలపెట్టేవారు కాదని, సహాయగుణం కలవారని, ధైర్య సాహసాలు కలవారని రాజాధీశులు వారి సేవలను కొనియాడి గ్రామాలు, భూములను ఇనాములు గా ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ ఆ భూములు లంబాడాల అధీనంలోనే ఉన్నాయి. గోర్ బంజారాలు (లంబాడీలు) భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ట్రైబల్స్‌గా ఉన్నారనడానికి ఇంతకంటే ఆధారాలు ఇంకేమి కావాలి?

ఆంధ్రప్రదేశ్ అవతరణకు పూర్వం కోస్తా, రాయలసీమ జిల్లా ల్లో ఉన్న లంబాడీలు షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీల)లుగా గుర్తింపు పొంది ఉన్నారు. అయితే నిజాం పాలనలోని లంబాడీలు ఎస్టీలుగా గుర్తింపు పొందలేదు. వారి జీవన పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉండేవి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ఇరవై సంవత్సరాల కు ఈ పరిస్థితులు మారాయి. ఒకే రాష్ట్రంలో ఉన్న ఒకే తెగకుచెందిన బంజారాలు ఒక ప్రాం తంలో ఎస్టీలుగా, మరో ప్రాం తంలో డీ నోటిఫైడ్ ట్రైబ్స్‌గా ఉండడాన్ని కేంద్ర ప్రభుత్వం గమనించింది.

అప్పటి కేంద్ర హోం మంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు శ్రీమతి ఇందిరాగాంధీ సానుకూలంగా స్పందించారు. AREA RESTRICTION REMOVAL BILL కేంద్ర కేబినెట్‌లో ఆమోదించి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 108/ 1976 చట్టం ప్రకారం తెలంగాణ లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చా రు. ఇందుకు మాజీ ఎంపి రవీందర్ నాయక్, వాగ్యా నాయక్ తదితరులు విశేష కృషి చేశారు.

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో 60 లక్షలకు పైగా గిరిజనులు ఉన్నారు. ఈ గిరిజనులు 33 తెగలుగా (ఇంకో రెండు తెగలను చేరుస్తున్నట్లుగా తెలిసింది) విభజింపబడి ప్రత్యేక జీవన విధా నం, సంస్కృతీ సంప్రదాయాలను కలిగియున్నారు. వీరు ఏజె న్సీ ప్రాంత గిరిజనులుగా, కొండ ప్రాంత గిరిజనులుగా, మైదా న ప్రాంత గిరిజనులుగా స్థిరపడియున్నారు. రాష్ట్రంలో ఏజన్సీ ప్రాంతంలో కంటే మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనుల శాతం ఎక్కువ.

రిజర్వేషన్ అనేది ఒక సామాజిక నేపథ్యం. తరతరాలుగా జాతి వివక్షకు గురవుతూ, ఆర్థిక, రాజకీయ సామాజికాభివృద్ధికి దూరంగా ఉన్నవారి మధ్య అంతరాలను తొలగించి వారి అభివృద్ధికి తోడ్పడానికే రిజేర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. షెడ్యూల్డు ట్రైబ్ అనేది ఎవరూ కూడా తమపేటెంట్ హక్కుగా భావించకూడదు. రాజ్యాంగబద్ధంగా ఎస్ టి జాబితాలో ఉన్న వారిని తొలగించండి అనే హక్కు ఎవరికీ లేదు. ప్రాచీన కాలం నుంచి బంజారాలు భారత్‌లో ఉన్నట్టు చరిత్ర స్పష్టం చేస్తోంది. అయినా కొందరు మా ఉపకులాల మధ్య సమస్యలు సృష్టిస్తున్నారు. ప్రభుత్వాధినేతలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు వాస్తవాలను గుర్తించి బంజారాల ఉన్నతికి తోడ్పడాలి.

-ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్
కాకతీయ విశ్వవిద్యాలయం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి